Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:40 pm Editor : Admin

ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆర్టీసీ కార్మికులారా… ఆత్మహత్యలు పరిష్కారం కాదు – పోరాటమే మార్గం! ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 24

రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. జీతాలు, భద్రత, ఉద్యోగ హామీలు వంటి ప్రాథమిక హక్కులు కూడా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం, ఆందోళనకరం.

టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మాట్లాడుతూ.

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు!

ఇది కార్మికుల పోరాటస్ఫూర్తిని బలహీనపరచే దురదృష్టకర పరిణామం.

ప్రభుత్వాల అన్యాయ విధానాలు, కార్మిక వ్యతిరేక నిర్ణయాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. కార్మికులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే. కానీ, పాలకులు తమ బాధ్యతలను విస్మరించి, కార్మికులను తీవ్ర నిరాశలోకి నెట్టేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి

సిపిఐ పార్టీ డిమాండ్లు:

ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

బకాయి జీతాలను వెంటనే చెల్లించాలి

ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

కార్మిక సంక్షేమ చర్యలు అమలు చేయాలి

కార్మికులారా… మీరు నిరాశ చెందకండి.

మీ కుటుంబాలు, మీ సహచరులు మీపై ఆధారపడి ఉన్నారు.

ఆత్మహత్యలు కాదు – సంఘటిత పోరాటమే మీ హక్కులను సాధించే మార్గం.

సిపిఐ పార్టీ మీతో ఉంది…

మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది.

“జీవించి పోరాడండి… గెలవండి!”