Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 7:07 am Editor : Admin

ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యంఅర్హులైన ప్రతి జర్నలిస్టుకు  అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి…

(యస్.పి. మల్లికార్జున సాగర్).కొల్లాపూర్, ఏప్రిల్ 25. నేటి సత్యం.

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి షరతులు లేకుండా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సభ్యులు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్కు , డిపిఆర్ఓ కు వినతి పత్రాలను అందజేశారు.

ఈ సందర్భం గా టిడబ్ల్యూజేఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు పరిపూర్ణం, ప్రధాన కార్యదర్శి పి. వెంకట స్వామి, బాదం పరమేశ్వర్లు మాట్లాడుతూ పత్రికా ప్రచురణ ఎడిషన్ కేంద్రాలతో పాటు ,జిల్లా కేంద్రాలతో పాటు మండల స్థాయిలో పనిచేసే విలేకరులకు కూడా అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని వారు కోరారు.

అలాగే నల్లమల్ల ప్రాంతాలలోని మన్ననూరు ఓటవర్లపల్లి పాతాళ గంగ ప్రాంతాలలో పనిచేస్తున్న విలేకరులు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని , గతం లో మాదిరిగానే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు డెస్క్ లలో పనిచేసే విలేకరులకు కూడా అక్రి డేషన్ కార్డులను ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయాలని పరిపూర్ణం, వెంకట స్వామి, బాదం పరమేశ్వర్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు, నాగర్ కర్నూలు జిల్లా డిపిఆర్ఓ కిరణ్ కుమార్ కు శనివారం రోజు లిఖితపూర్వక వినతి పత్రాలను అందజేశారు.