Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 8:46 am Editor : Admin

పరిశ్రమల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సీఎం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం పరిశ్రమల శాఖ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. దావోస్ పర్యటనలో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన  ఎం ఓయు .పురోగతిపై ఆరా తీశాను. ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నాను.

ఏమోయు లు కుదుర్చుకున్న కంపెనీలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి, ప్రాధాన్యత క్రమంలో భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని ఆదేశించాను.

డేటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించాను.

ఎం ఓ యు లు కుదుర్చుకున్న సంస్థలు వీలైనంత త్వరగా తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించాను.

ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.