(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రజాపాలన అని దొంగ పాలన తెచ్చారు!
పీఏసీఎస్ కేంద్రం వద్ద మక్క రైతుల దుస్థితి
రాత్రి పూట నేలపై పడుకుని, క్యూలైన్లలో పేపర్లు పెట్టి పంట కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు పీఏసీఎస్ కేంద్రం వద్ద రాత్రి వేళ నేలపై పడుకుని, క్యూలైన్లలో పేపర్లు పెట్టి మక్కజొన్న పంట కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్న రైతులు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మక్కజొన్న పంట కొనుగోళ్లలో విఫలం అయిందని, కనీసం గన్నీ బ్యాగుల సరఫరా కూడా సక్రమంగా చేయడంలేదని రైతుల ఆగ్రహం
దళారులు గన్నీ బ్యాగులు దొంగచాటుగా అమ్ముకుంటున్నారని, ప్రజా పాలన అని దొంగ పాలన తెచ్చారని రైతుల అసహనం
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదని, అధికారులు కూడా నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని ఆవేదన
దాదాపు 100 మంది ఇక్కడే పడుకున్నామని, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గన్నీ బ్యాగులు సరఫరా చేసి, మక్కజొన్న కొనుగోళ్లు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతుల హెచ్చరిక