(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు బలి తీసుకున్న మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైప్ లీక్ అవుతుందని మరమ్మతుల కోసం 20 రోజుల క్రితం నాలుగు మీటర్ల గుంత తవ్వి ఉంచిన అధికారులు
ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయిన ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న కవిత అనే మహిళ కూతురు మోక్షిత(5)
మోక్షిత గుంతలో పడడం గమనించి తల్లికి చెప్పిన చిన్నారి అక్క దీక్షిత
దీంతో గుంతలోకి దిగిన తల్లి మోక్షితను బయటికి తీయగా, అప్పటికే మృతి చెందిన చిన్నారి
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని మృతదేహంతో ఆందోళనకు దిగిన గ్రామస్తులు