Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 2:26 pm Editor : Admin

పిల్లల వేసవి శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ కె నారాయణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం మార్చి 3: కొండాపూర్. పిల్లల వేసవి శిబిరం ప్రారంభోత్సవం :

పిల్లలకు వేసవి శలవులలో వివిధ నైపుణ్యాలు నేర్చుకుంటూ వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకోటానికి నీలం రాజశేఖర రెడ్డి రీసెర్చ్ సెంటర్,

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్,

సురవరం సుధాకర్ రెడ్డి లైబ్రరీ లోని ఛిల్డ్రన్స్ లైబ్రరీ లో పిల్లలకు మంచి కార్యక్రమాలు రూపొందించబడినాయి.

డ్రాయింగ్ & పెయింటింగ్, క్రాఫ్ట్ వర్క్స్, సింగింగ్, స్టోరీ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, రీడింగ్, క్లే వర్క్, డ్రామా రైటింగ్ & ప్లేయింగ్ మొదలైన సృజనాత్మక కార్యక్రమాలు

ఈ రోజు ఉదయం 10.00 గంటలకు సి ఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె నారాయణ గారు

ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది పిల్లలు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకు కాగితంతో క్రాఫ్ట్ చేయటం , ఫాబ్రిక్ పెయింటింగ్ నేర్పించడం తో పాటు క్యారమ్స్ , చెస్ వంటి ఆటలు కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డా. కె. నారాయణ గారు మాట్లాడుతూ వేసవి సమయము లో పిల్లలు సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని ఇటువంటి క్యాంపు లకు వెళ్ళడం ఎంతో ఉపయోగకరముగా ఉంటుందని, పిల్లలు అందరూ దీని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

శ్రీమతి జ్యోత్స్న గారు ఫాబ్రిక్ పెయింటింగ్ , శ్రీమతి సునీత , కె. జ్యోత్స్న పేపర్ క్రాఫ్ట్స్ లో పిల్లలకు శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం డైరెక్టర్ సురేష్ బాబు , కన్వీనర్ అజయ్ కుమార్ , కమిటీ మెంబర్స్ డా. బి వి విజయ లక్ష్మి, డా. కె. పూర్ణచంద్ర రావు , సుబ్బరామన్ , వెల్లంకి అనిల్ ,

సురవరం సుధాకర్ రెడ్డి లైబ్రరీ కన్వీనర్ రాజగోపాల్ రెడ్డి, కొ కన్వీనర్ కె. జ్యోత్స్న, మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ జే. కల్పన , మంజరి, సి ఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం నివాసులు తదితరులు పాల్గొన్నారు.

వేసవి శిబిరం ద్వారా మే నెలలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని వాటిని పిల్లలు తల్లితండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.