Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 1:15 pm Editor : Admin

పెంచిన ఎల్పిజి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేరిలింగంపల్లి మే 6

*పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి – ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలి*

దేశంలో పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ఇది ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోంది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు కొండాపూర్ చౌరస్తాలో 12 గంటలకు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ

వంటగ్యాస్ (ఎల్పీజీ) ధరలు అధికంగా ఉండడం వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచుతోంది.

అదేవిధంగా, కొన్ని ప్రాంతాల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం వల్ల ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి:

– పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి

– ప్రజలకు సరిపడా సరఫరా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి

– ఇంధన కొరత సమస్యను పూర్తిగా నివారించాలి

ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ విషయంలో ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

ప్రజలపై భారం మోపే విధానాలను తక్షణమే ఉపసంహరించాలి! ఈ కార్యక్రమంలో. కే చందు యాదవ్ శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి. కే వెంకటస్వామి సిపిఐ జిల్లా సమితి సభ్యులు. కే సుధాకర్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు. తుపాకుల రాములు ఏఐటీయూసీ.కే ఖాసీం మండల్ నాయకుడు. జెట్టి శ్రీనివాస్ మండల సహకార దర్శి. బి నారాయణ. ఆఫీస్ పెట్ కార్యదర్శి. కే శివకుమార్ ఏవైఎఫ్ కార్యదర్శి. రఘు. తదితరులు పాల్గొన్నారు