(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం గన్నేరువరం మే 10
గన్నేరువరం మండల కేంద్రంలో ప్రధాన రహదారి మూల మలుపు వద్ద నిలిచిన వడ్ల లోడు లారీ
గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న మూల మలుపు ప్రయాణికులకు శాపంగా మారింది. యాస్వాడ ఐకేపీ సెంటర్ నుండి వడ్ల సంచుల లోడుతో వస్తున్న ఒక భారీ లారీ, ఈ ఇరుకైన మూల మలుపు వద్ద తిరగలేక, రాడ్ విరిగి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది.ప్రమాదకరమైన మూల మలుపు యాస్వాడ ఐకేపీ సెంటర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ మూల మలుపు వద్ద తరచూ ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాహనదారులు ఐకెపి సెంటర్ నుండి వడ్ల బస్తాల లోడుతో వస్తున్న లారీ ఇక్కడ ఇరుక్కుపోవడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి.నిధులున్నా జరగని పనులు: ఈ రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరైనప్పటికీ, పనులు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రజల ఆవేదన: నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మంజూరైన నిధులతో వెంటనే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలని గన్నేరువరం గ్రామ ప్రజలు కోరుతున్నారు.