Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:34 am Editor : Admin

కేరళ సీఎం గా వీడి సతీశన్.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం కేరళ మే 14

*కేరళ సీఎంగా వీడీ సతీశన్‌*

కేరళ నూతన సీఎంగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. 11 రోజుల మథనం తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. సతీశన్‌ స్వస్థలం ఎర్నాకుళం జిల్లా నెట్టూరు. 2021-26 మధ్య విపక్ష నేతగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో పరాపుర్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించింది.