Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 2:56 am Editor : Admin

మహిళా మృతి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పురుగుల మందు తాగి వివహిత మృతి

గన్నేరువరం, మే 18 (నేటిసత్యం):గన్నేరువరం మండల ఖాసీంపేట గ్రామంలో పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు గన్నేరువరం సబ్ ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.ఖాసీంపేట గ్రామానికి చెందిన కల్లేపల్లి సరిత భర్త పేరు అమన్ గత పదేళ్లుగా మతిస్థిమితం సరిగా లేక బాధపడుతోంది. ఈ క్రమంలో ఈనెల 14న (14-05-2026) రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆమె ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన ఆమె తల్లి కల్లేపల్లి బాలవ్వ వెంటనే సరితను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ సరిత ఈరోజు (సోమవారం) మృతి చెందింది. మృతురాలి తల్లి బాలవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.