(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కడప మే 20
*జీవన వృద్ధాశ్రమం. సి ఆర్ ఫౌండేషన్ లో విలీనం*
కడప జిల్లా బక్రపేట వద్ద పోలీస్ బెటాలియన్ ప్రక్కన ఉన్న “జీవన వృద్ధాశ్రయం”ను శ్రీమతి సంజీవమ్మ, మంచిరెడ్డి దంపతులు నిర్మించి, దానిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కు విలీనం చేసి బహుకరించారు.
వారి ఈ మహత్తర సేవాభావానికి, సామాజిక బాధ్యతకు చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.
ఈ వృద్ధాశ్రయాన్ని జూలై 1వ తేదీన పునరుద్ధరించి తిరిగి ప్రారంభిస్తున్నాము.
65 సంవత్సరాలు పైబడిన మహిళలు మరియు పురుషులు, సంస్థ నియమ నిబంధనలు అంగీకరించిన పక్షంలో, ఇందులో చేరవచ్చు.