(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ మే 20
మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీలో మెయిన్‌హార్ట్ సంస్థ నిర్లక్ష్యం
ఇప్పటికీ సిద్ధం కానీ మూసీ ప్రాజెక్టు డీపీఆర్
కమీషన్ల కోసమే బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నారని ముందుగానే తెలిపిన బీఆర్ఎస్ పార్టీ
55 కిలోమీటర్ల మూసీ ప్రాజెక్టుకు 18 నెలల్లో డీపీఆర్ ఇవ్వాలని 2024 డిసెంబర్ నెలలో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం
జూన్ 4వ తేదీతో గడువు ముగుస్తున్నా, డీపీఆర్ సిద్ధం చేయని మెయిన్‌హార్ట్ సంస్థ
మెయిన్‌హార్ట్ సంస్థపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అలాంటి బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి డీపీఆర్ ఇవ్వొద్దని బీఆర్ఎస్ పార్టీ చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం
కేవలం కమీషన్ల దండుకోవడానికే మెయిన్‌హార్ట్ లాంటి బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నారని ముందే తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
కేవలం 55 కిలోమీటర్ల విస్తీర్ణతకు 18 నెలల్లో డీపీఆర్ పూర్తి చేయకపోవడం వల్ల, మెయిన్‌హార్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం బయటపడిందని విమర్శిస్తున్న రాజకీయ విశ్లేషకులు