(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎన్నాళ్లీ మొద్దు నిద్ర ముఖ్యమంత్రి
పంట కొనుగోళ్ల సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
క్యాబినెట్ మీటింగ్ లోనైనా కళ్ళు తెరవండి
రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా..?
కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా ?
ధ్యానం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా ?
రెండునెలలైనా మొద్దు నిద్ర వీడని ముఖ్యమంత్రిపై ధ్వజం
కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణమృదంగమేంటి ??
రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడు.. రాస్తారోకో జరగని రహదారి లేదు
ఇవాళ బూతులు తిడుతున్న రైతులే.. రేపు వాతలు పెడతారు
కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైంది
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడు. ఆరు దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని సంబరంగా సాగుచేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మట్టి కొట్టింది
రైతుకు రక్షణగా కేసీఆర్ గారు అమలుచేసిన ఒక్కో పథకానికి గత రెండేన్నరేళ్లుగా పాతరేసిన మీరు మీ చేతకానితనంతో అన్నదాత వెన్నువిరిచారు
ఇవాళ మీ అరాచక పాలన ఆనవాళ్లు పరాకాష్టకు చేరాయి. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండునెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్థనాదాలు చేస్తున్నారు
70 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో మీకున్న శ్రద్ధలో ఒక్క శాతం రైతులపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మీ కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి మాత్రం మీలో కనిపించడం లేదు
అందుకే రైతులు మరో మార్గం కనిపించక, ఇంతకాలం కంటిపాపలా పెంచుకున్న పంటను తమ చేతులతోనే తగలబెట్టుకుంటున్నారు
కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూసిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించండి. లేకపోతే మీరు చరిత్రలో ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారు – కేటీఆర్