Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 5:25 pm Editor : Admin

ఓం నమో భగవతే శ్రీ రమణాయ..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ఒక భక్తుడు :

భగవాన్! నా బాధ్యతలన్నింటిని, బరువులనన్నింటిని నేను వదలి వేయగలనా!

మహర్షి :

దేవాలయము యొక్క గోపురమును చూడుము. దానిపై అనేక విగ్రహములు చెక్కబడియుండును. వానిలో గోపురమునకు నడుమ నాలుగువైపుల నాలుగు బొమ్మలు ఉండును. ఆ ఎత్తైన గోపురమును ఆ బొమ్మలు మోయుచున్నవా? లేదుకదా!

జగత్ప్రభువు అన్ని భారములను వహించుచుండగా, నీవు వహించుచున్నావని భావించడం ఎందుకు? భాద్యతలు, భారములన్నియు నేనే మోయుచున్నానని నీవు ఎందుకు భావించుచున్నావు?

నీవు ఏమి చేయవలసియున్నను, ఆ పనిని సరియైన సమయములో చేయుటకు నీవు నిమిత్తమాత్రముగా, ఒక ఉపకరణమాత్రముగా ఉంటావు. అంతే. కాబట్టి నీ భారములన్నింటిని దైవానికి అప్పగించవచ్చును.

పని చేయుటకు నీకు ఇష్టం లేకపోయినా, ఆ పనిని నీవు చేయలేవు అని తలపకుము. పని చేయుటకు గల నీ కోరిక ఆ పనికి బలమును చేకూర్చదు. బలము యావత్తు పరమేశ్వరుని బలమే.