Neti Satyam
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 4:42 pm Editor : Admin

రాష్ట్రపతి ద్రౌపది మరుమకు ఉత్తరాలు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ మే 30

భారతదేశంలో జరిగే సాధారణ జనగణలో గిరిజనులకు ప్రత్యే కోడును కేటాయించి అమలు పరచాలి

భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది మురుముకు పోస్టు కార్డు ఉద్యమం ద్వారా వినతి.

అఖిలభారత ఆదివాసి మహాసభ జాతీయ కమిటీ పిలుపుమేరకు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి ద్రౌపది మురుముకు పోస్ట్ కార్డు ఉద్యమం.

భారతదేశంలో జరిగే ఎటువంటి సాధారణ జన గణ లో గిరిజనులకు ప్రత్యేకమైన కోడ్ ను కేటాయించి అమలు పరచాలని కోరుతూ అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ జిల్లా తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగినటువంటి పోస్ట్ కార్డు ఉద్యమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ నాయక్ పాల్గొని ప్రసంగిస్తూ.

భారతదేశ వ్యాప్తంగా 760 కి పైబడి గిరిజన తెగలు వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నారు గిరిజనులు ఇంకా అభివృద్ధికి ఎంతో దూరంగా వారి జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు నేటికీ స్వాతంత్ర ఫలాలు గిరిజనులకు అందని ద్రాక్షగా మిగిలి ఉంది పాలకవర్గాలు మారుతున్న గిరిజనుల బ్రతుకులు మాత్రం మారటం లేదు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనుల అస్తిత్వాన్ని సాంస్కృతిని సాంప్రదాయాలను కనుమరుగు చేసేటువంటి కుట్రలు పన్నుతా ఉంది ఈశాన్య రాష్ట్రాలలో తెగల మధ్యన చిచ్చుపెట్టి అఘాయిత్యాలు మారిన హోమాలు సృష్టించిన విష విషయం ప్రజలందరికీ తెలిసిందే కానీ గిరిజనులు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వారి యొక్క హక్కులు అనేకమైనటువంటివి చట్టాలను కలిగి ఉన్న అవి అమలుకు నోచుకోవడం లేదు . అటవీ హక్కుల చట్టం.పేసా చట్టం .వన్ ఆఫ్ సెవెన్టీ చట్టాలు అమలుకు నోచుకోవటం లేదు.

రోజుకు ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు మరణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి గిరిజనులకు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో వారి జీవనం ముడిపడి ఉంది అట్టి ఆదివాసి గిరిజనులను బిజెపి పెద్దలు వన్ వాసీలుగా పేర్కొంటూ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నారు.

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎటువంటి సాధారణ జనగణలలో ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి కోడ్ కాలాన్ని పొందుపరచాలని భారత రాష్ట్రపతి ద్రౌపతి మురుముకు పోస్ట్ కార్డు ద్వారా వినతులను పంపించటం జరుగుతుంది దీనిపై వెంటనే స్పందించి అది అమలయేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి అంజయ్య నాయక్ కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చినటువంటి చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు పరచాలని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లలో అధిక కేటాయింపులు చేసి. సంక్షేమ పథకాల అమలు పడకేసింది వెంటనే వీటన్నిటి పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అంజయ్య నాయక్ గుర్తు చేశారు

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణ గిరిజన సమాఖ్య అధ్యక్షులు నేనావత్ రూప్ సింగ్ నాయక్. వడిత్యా దసురు.

ఇస్లావత్ శీను. జై కమలి. రమావత్ శీను. ఆర్ వశ్య.

భారతి. నేనావత్ సోని తదితరులు పాల్గొన్నారు.