Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 4:49 am Editor : Admin

బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపిన గాంధీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 3

బెల్ట్ షాప్ ల పై ఉక్కుపాదం మోపిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

అర్థరాత్రి స్వయంగా వెళ్లి బెల్ట్ షాప్ నిర్వాహకుల ను పట్టుకొని ఎక్సైజ్ మరియు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి దగ్గర ఉండి పట్టించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

మహిళ సోదరీమణుల విజ్ఞప్తి మేరకు అర్థరాత్రి స్వయంగా వెళ్లి పట్టుకున్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

బెల్ట్ షాప్ ల తో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వారు ఎంతటి వారు అయిన వదిలి పెట్టె ప్రసక్తే లేదు, చట్టపరమైన ,కఠిన చర్యలు తీసుకుంటాం.

గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడంతోనే బెల్ట్ షాపుల ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకున్న మహిళలు

*సమస్య పై స్పందించి, చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ PAC చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన మహిళ సోదరిమనులు, కాలనీ వాసులు*

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లు ఓపెన్ చేసి నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు .కాలనీ లలో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నారు అని స్థానిక మహిళ సోదరిమణులు గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారికి విన్నవించుకోగా వెంటనే స్పందించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెక పూడి గాంధీ గారు స్వయంగా అర్థరాత్రి వెళ్లి బెల్ట్ షాప్ ల నిర్వాహకులను పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగినది.