(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మాదాపూర్ లో శ్రీ చైతన్య మోసం బట్టబయలు చేసిన సెంట్రింగ్ యూనియన్
శ్రీ చైతన్య యజమాన్యం చేస్తున్న మోసాలు విద్యార్థులకే కాదు కార్మికులను కూడా వదలడం లేదు
శేరిలింగంపల్లి కానామెట్టు సింధు హాస్పిటల్ ఆపోజిట్ కొత్తగా నిర్మించిన శ్రీ చైతన్య బిల్డింగులు. ఆ బిల్డింగ్లకు ఒక సెంట్రింగ్ యజమానితో సెంట్రింగ్ పెట్టించుకుని వర్క్ ను పూర్తిచేసుకుని బిల్డింగు కంప్లీట్ అయిన తర్వాత అతనికి రావలసినటువంటి అమౌంటు ఇవ్వకుండా అతనిపై దాడి చేసిన శ్రీ చైతన్య యజమాన్యం.
సుమారుగా 60 లక్షల రూపాయలు సెంట్రింగ్ కాంట్రాక్టర్కు చెల్లించవలసి ఉన్న శ్రీ చైతన్య
వర్క్ పూర్తి అయిన తర్వాత ఇవాళ రేపు అదిగో ఇదిగో అని దాటి వేస్తున్న తీరు ఈరోజు ఉదయము సెంట్రింగ్ కాంట్రాక్టర్ వర్క్ చేసిన బిల్డింగ్ దగ్గరకు వెళ్లి నాకు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మీరు ఇందులో మీ కార్యకలాపాలు జరుపుకోండి అని అడగగా. అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయాలపాలు చేసిన శ్రీ చైతన్య యజమాన్యం
విషయం తెలుసుకున్న సెంట్రింగ్ యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున బిల్డింగ్ దగ్గరికి చేరుకొని ఆందోళన చేపట్టారు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు
శ్రీ చైతన్య యజమాన్యం పిల్లల భవిష్యత్తుల తో. ఆడుకోవడమే కాకుండా ఇలా వర్క్ చేసిన వర్కర్లను కూడా వదలడం లేదని ప్రజలు వాపోతున్నారు. శ్రీ చైతన్య మోసాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు సెంట్రింగ్ పనిచేసిన కాంట్రాక్టర్కు న్యాయం చేయాలని ప్రజల ఆవేదన