Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 2:12 pm Editor : Admin

సోమశిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం కొల్లాపూర్ జూన్ 4

కృష్ణా నది తీరం సోమశిల కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

(యస్.పి. మల్లికార్జున సాగర్).

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోనీ సాగు తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పర్యవేక్షణ గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 4 5 తేదీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చేపట్టిన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంకాలం ఆరున్నర గంటలకు కొల్లాపూర్ మండలం లో కృష్ణా నది తీరంలో ఉన్న సోమశిల గ్రామానికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉత్తమ కుమార్ రెడ్డి తదితరులు రాగా కొల్లాపూర్ శాసనసభ్యులు, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీధర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉత్తమ కుమార్ రెడ్డిలకు స్వాగతం పలికారు.

అనంతరం వారు కృష్ణా నది తీర పరిసరాలను సోమశీల గ్రామం లోని ద్వాదశ జ్యోతిర్లింగాల శ్రీ లలితాంబికా సోమేశ్వర స్వామి దేవాలయాల పరిసరాలను పరిశీలించగా దేవాలయాల ప్రాముఖ్యతను చరిత్రను మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తూ పర్యాటక ప్రాంతం గా సోమశీల గ్రామం లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి కి తెలియజేశారు.