Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 6:38 am Editor : Admin

సమస్య పరిష్కరించి రోడ్డు వేయించిన నా దాత్రినాథ్ గౌడ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి  జూన్16

రెండు సంవత్సరాల నుండి సమస్యలో ఉన్న రోడ్డును పరిష్కరించిన దాత్రినాథ్ గౌడ్

ఓల్డ్ హఫీజ్ పేట్ నుండి జనప్రియనగర్ కు వెళ్లే దారిలో ఉన్న కుమ్మరిబస్తీలో గత రెండున్నర సంవత్సరాలనుండి బస్తీ వాసులకు మరియు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్న వ్యక్తులకు మధ్య జరుగుతున్న వివాదం మూలంగా వారు సీసీ రోడ్ వేయకుండా ఆపేయడం జరిగింది. స్కూల్స్ ఓపెన్ అవడం వలన ప్రతిరోజు దాదాపుగా రెండు వందలకు పైగా విద్యార్థులు ఈ రోడ్ ద్వారా స్కూల్స్ కు వెళ్లడం జరుగుతుంది. కావున వారు ఇబ్బంది పడకుండా హఫీజ్ పేట్ యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి రెండున్నర సంవత్సరాల వివాదాన్ని ముగించి వెంటనే సీసీ రోడ్ పనులు మొదలయ్యేలా చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు కుమ్మరిబస్తీలో వేస్తున్న సీసీ రోడ్ పనులను ధాత్రీనాథ్ గౌడ్ గారు పర్యవేక్షించడం జరిగింది.