Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 8:00 am Editor : Admin

గుడిసెల కూల్చివేతలు నిలిపివేయండి కూనంనేని




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హనుమకొండ జూన్ 20

గుండ్ల సింగారంలో పేదల గుడిసెలను కూల్చివేయడాన్ని నిలిపివేయాలని, పునర్నిర్మాణానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన కూనంనేని.

హనుమకొండ జిల్లా, గుండ్ల సింగారంలోని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో పేదలు వేసుకున్న గుడిసెలపై రెవెన్యూ, పోలీస్ అధికారులు కూల్చివేయడం నిలిపివేసి, పునర్నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, పోలీస్ అధికారులు కూల్చివేయడం సమంజసం కాదని, పక్కనే పెద్ద పెద్ద భవనాలు కట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పేదలు వేసుకున్న 300 గుడిసెలను కూల్చివేయడం అన్యాయమన్నారు. వారందరూ ఉండడానికి ఇండ్లు లేని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రజలని సాంబశివరావు తెలిపారు. ఈ భూములు దేనికి పనికిరావని, పేదలకు నివాసయోగ్యంగా ఉంటాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో కూడా రాత్రికి రాత్రే పేదల గుడిసెలను కూల్చివేశారని, అదే తరహాలో ఇప్పుడు గుండ్ల సింగారంలో చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు గుడిసెలను పునర్ నిర్మించుకోవడానికి అవకాశం కల్పించుకోవడం కొరకు స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.