గుడిసెల కూల్చివేతలు నిలిపివేయండి కూనంనేని
నేటి సత్యం హనుమకొండ జూన్ 20 గుండ్ల సింగారంలో పేదల గుడిసెలను కూల్చివేయడాన్ని నిలిపివేయాలని, పునర్నిర్మాణానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన కూనంనేని. హనుమకొండ జిల్లా, గుండ్ల సింగారంలోని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో పేదలు వేసుకున్న గుడిసెలపై రెవెన్యూ, పోలీస్ అధికారులు కూల్చివేయడం నిలిపివేసి, పునర్నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలను...