Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 5:13 pm Editor : Admin

శేర్లింగంపల్లి లో గులాబీ జెండా ఎగరవేదం . కేటీఆర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 23

సమావేశంకు వచ్చిన కేటీఆర్ ఘన స్వాగతం

శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరవేద్దాం..

ఉద్యమ నాయకులు చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడి

భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచలను ప్రతి ఒక్కరం పాటిద్దామని, క్షేత్రస్థాయిలోకి ఎస్ఐఆర్ పై అవగాహనను తీసుకువెళ్దామని ఉద్యమకారులు చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడించారు. పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరారు. పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నేతలు ఎస్ఐఆర్ పై పని చేయాలని, వర్కింగ్ ప్రెసిడెంట్ సూచించినట్లుగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరారు. మంగళవారం మియాపూర్ లో జరిగిన ఎస్ఐఆర్ , కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ కు చిర్రా రవీందర్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా శాలువాతో సన్మానించిన ఆయన.. ఫోటో ప్రేమ్ ను అందజేశారు. కేటీఆర్ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసిన చిర్రా రవీందర్ యాదవ్, అనంతరం మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా నిలిచే పార్టీ భారాస మాత్రమేనని చెప్పారు. సమావేశంలో సైతం కార్యకర్తలే పార్టీకి బలమని కేటీఆర్ చెప్పారని, కారు డ్రైవర్లు కార్యకర్తలు, ఉద్యమకారులేనని స్పష్టం చేశారని గుర్తు చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వరకు నిరంతరంగా కృషి చేయాలని కోరారు. కేటీఆర్ మార్గదర్శకంలో హైదరాబాద్ వ్యాప్తంగా గులాబీ ప్రభంజనం సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.