(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం జూన్ 28 .
సీసీఎస్ పోలీసుల విస్తృత సోదాలు.. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యం
భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు,సీసీఎస్ సీఐ రమేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా నార్కోటిక్స్ విభాగం పోలీసులు,నార్కోటిక్స్ జాగిలంతో కలిసి ఆదివారం ఉదయం భూపాలపల్లి బస్టాండ్, బాంబులగడ్డ ప్రాంతంతో పాటు గంజాయి సేవించే అవకాశం ఉన్న అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
అదేవిధంగా గతంలో గంజాయి సేవిస్తూ లేదా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారి నివాసాల్లో, అనుమానితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యమని, మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ, అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు, నిల్వ ఉంచినట్లు లేదా రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే 100 లేదా 8712658111 నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సోదాల్లో నార్కోటిక్స్ విభాగం ఆర్‌ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది శ్రీనివాస్, ప్రశాంత్, శ్రీనివాస్ మరియు డాగ్ హ్యాండ్లర్ శ్రీధర్ పాల్గొన్నారు.