గెలవడమే జీవితమైతే..నేర్చుకోవడం ఎక్కడ.?
నేటి సత్యం జూన్ 28 గెలవడమే జీవితమైతే... నేర్చుకోవడం ఎక్కడ? మన చుట్టూ ఉన్న గజిబిజి ప్రపంచాన్ని ఒక్కక్షణం నిదానించి గమనించండి. పసితనపు నవ్వులు కూడా సరిగ్గా వికసించకముందే, పిల్లల లేత గుండెలపై ఒత్తిడి పర్వతాలు వచ్చి పడుతున్నాయి. బడిలో ఫస్ట్ ర్యాంకు రాకపోతే కన్నవారి ముఖాల్లో కారుచీకట్లు కాస్తో కూస్తో పోటీ పరీక్షల్లో వెనుకబడితే సమాజం చూపే నిరాదరణ రేపు ఉద్యోగంలో ప్రమోషన్ మిస్సయితే స్నేహితుల గుంపులో పలచబోయే పరువు! ఇదంతా చూస్తుంటే గుండెల్లో ఒక...