(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం చేవెళ్లే జూన్ 29
ఇండ్ల స్థలాల కోసం చలో ఆర్డీవో ఆఫీస్
జూలై 1వ తేదీన ఆర్డిఓ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి పిలుపు
ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మండల పార్టీ సహాయ కార్యదర్శి ఎం డి మక్బూల్ అధ్యక్షతన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి హాజరై మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని గతంలో పట్టాలు ఇచ్చి స్థలాల పొజిషన్ చూపించని వారికి స్థలాల పొజిషన్ చూపించాలని డిమాండ్ చేస్తూ జూలై 1వ తేదీన వేలాది మందితో చేవెళ్లలోని ఆర్డీవో కార్యాలయం ముందు ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలపార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నాయకులు కార్మికులు కర్షకులు రైతులు ఇండ్లు లేని నిరుపేదలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు వడ్ల మంజుల పాల్గొన్నారు