Neti Satyam
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 10:18 am Editor : Admin

పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వండి ఆర్డిఓ కార్యాలయం సిపిఐ ముట్టడి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం రాజేంద్రనగర్ జులై 1

ఇంటి స్థలాలు – డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు – పట్టాలు వెంటనే ఇవ్వాలి

సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా

రాజేంద్రనగర్ ఆర్డిఓ కార్యాలయం ముందు ఉదయం 11 గంటలకు కన్య గారి నరసింహారెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది

పేద ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నేడు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా పుస్తకాల నర్సింగ్ రావు రాష్ట్ర సమితి సభ్యులు. టి రామకృష్ణ.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు . మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పేదలకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని తీవ్రంగా విమర్శించారు. సొంత ఇంటి కలతో వేలాది నిరుపేద కుటుంబాలు ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పాలకులకు చీమకుట్టినట్టూ లేదన్నారు.

భూమిలేని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు అందించాలని, పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసి అర్హులకు అప్పగించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రజల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదల హక్కుల సాధన కోసం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

సిపిఐ డిమాండ్లు:

– అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలాలు వెంటనే కేటాయించాలి.

– పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలి.

– పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలి.

– పేదల గృహ హక్కును ప్రభుత్వం రాజ్యాంగబద్ధ బాధ్యతగా అమలు చేయాలి.

రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే చందు యాదవ్. ఆర్ యాదగిరి. రియాజ్ కే నరసింహారెడ్డి.రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు. నర్రగిరి ఎన్. మల్లేష్. కె లక్ష్మమ్మ మహిళ నాయకులు. కే సుధాకర్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు. కే ఖాసీం. తుపాకుల రాములు ఏఐటిసి అధ్యక్షులు. ఎస్ కొండలయ్య జెట్టి శ్రీనివాస్ బి నారాయణ తదితరులు పాల్గొన్నారు