(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 2
ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు చేపడుతున్న వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి లో జరుగుతున్న 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను CMC ఇంజనీరింగ్ ,టౌన్ ప్లానింగ్. ఎలక్ట్రికల్ విభాగం అధికారులు గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి తో కలిసి పరిశీలించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వెళ్లే రోడ్డు వయా ఎల్లమ్మబండ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ,ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగినది అని ,దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై గతంలో అధికారులతో కలిసి ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర గా స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం జరిగిన సంగతి విదితమే అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. 100 ఫీట్ రోడ్డు విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి, ప్రణాళిక ను రూపొందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, రోడ్డు మధ్యలో వచ్చిన బండ రాళ్ళ ను తొలగించడం జరుగుతుంది అని,రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తి వరకు ఎల్లమ్మ బండ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన గల విద్యుత్ స్థంబాలను స్థాన భ్రంశం చేపట్టడం జరిగినది అని అన్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ గారు చెప్పడం జరిగినది. 100 ఫీట్ రోడ్డు విస్తరణ పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది అని,ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు