(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఆదిలాబాద్ జులై7
ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కరోనా ఓ.పి ముందట ఏఐటియుసి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డోంగ్రే చందు ఆధ్వర్యంలో రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, కార్మికులకు పెరుగుతున్నటువంటి నిత్యవసర సరుకులకు అనుగుణంగా కనీసం 26 వేల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంటసేపు నిరసన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ గారు మీడియాతో మాట్లాడుతూ రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కనీసం 26,000 ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే కార్మికులు సంవత్సరం పాటు పనిచేస్తే ఒక నెల వేతనంతో కూడిన బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు ఇంతే కాకుండా పండుగ ఆర్జిత సెలవులు పి.ఎఫ్ ఈ.ఎస్.ఐ సీనియర్ శానిటేషన్ కార్మికులకు పేషెంట్ కేర్ ప్రమోషన్లు ఇవ్వాలని అలాగే రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కాంట్రాక్టర్ గా కృష్ణ కన్స్ట్రక్షన్స్ వారు సంవత్సరం నర క్రితం ఉండేవారు ఆ ఏజెన్సీ వారు ఏదో తప్పు చేశారని జిల్లా కలెక్టర్ గారు కృష్ణ ఏజెన్సీని రద్దు చేశారు అప్పటినుండి ఇప్పటివరకు రిమ్స్ డైరెక్టర్ గారే రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ కార్మికులకు కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారు గతంలో కాంట్రాక్టు ఏజెన్సీ వారు నెల నెల వేతనాలు పి.ఎఫ్ ఈ.ఎస్.ఐ కార్మికుల ఖాతాలో జమ చేస్తే ఇప్పుడు మాత్రం నెల నెల వేతనాలు రావడం లేదు పి.ఎఫ్ ఈ.ఎస్.ఐ నెల నెల కార్మికుల ఖాతాలో జమ చేయడం లేదు ఏజెన్సీ వారిని రద్దుచేసి సంవత్సరం నరవుతున్న ఇప్పటివరకు వేరే కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ అప్పచెప్పకుండ కార్మికులకు యూనిఫామ్ లు కూడా ఇవ్వకుండా పనిచేయిస్తున్నారని మండిపడ్డారు రేపటి నాడు కార్మికులకు ఏదైనా జరుగుతే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు కాంట్రాక్ట్ ఏజెన్సీ వారు తప్పు చేస్తే రిమ్స్ డైరెక్టర్ గారికి మొరపెట్టుకునే పరిస్థితి నుండి రిమ్స్ డైరెక్టర్ గారి తప్పు చేస్తే ఎవరి దగ్గరికి పోవాలో కార్మికులు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని మీడియా ద్వారా వివరిస్తూనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన కొత్త కాంట్రాక్టర్ ను నియమించి కార్మికులకు యూనిఫామ్స్ ఇచ్చి నెల నెల వేతనాలు పి.ఎఫ్ ఈ.ఎస్.ఐ ఇతరాత్ర సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూనే రేపు కూడా యూనియన్ ఆధ్వర్యంలో గంట సేపు నిరసన ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు రేపు సాయంత్రం లోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే శానిటేషన్, పేసెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, కార్మికులకు 26 వేల వేతనంతో కూడిన జి.ఓ ను అమలు చేసి కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించకపోతే ఎల్లుండి అనగా 9 జులై న హైదరాబాద్ కోటి లోని డి.ఎం.ఈ కార్యాలయాన్ని ముట్టడించడానికి కార్మికులు వెనుకాడబొరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎండి ముజీబ్, sk ఇక్బాల్, దత్తాత్రి దాస్, పెందుర్ దిలీప్, నిట్టెడి నగేష్, ఇప్ప శ్రీను, జి సంగీత, నర్సమ్మ, కమల, పద్మ, బి లక్ష్మి, ఇర్ఫాన్, వెంకటేష్, విట్టల్, సురేష్, రమేష్, పులి సునీత, రమ, లతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.