(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం మియాపూర్ జూలై8
భోజనంలో నిద్ర మాత్రలు కలిపి దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను హతమార్చిన భార్య
మియాపూర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు
హైదరాబాద్ – మియాపూర్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో తనకున్న సొంత అపార్ట్మెంట్లు అద్దెకు ఇస్తూ జీవనం కొనసాగిస్తున్న మల్లాని పెంటేష్(52) అనే వ్యక్తి
పదేళ్ల క్రితం భార్యతో విభేదాలు తలెత్తడంతో, పిల్లలను భార్య వద్దే వదిలేసి ఒంటరిగా ఉంటున్న పెంటేష్
ఈ నేపథ్యంలో పెంటేష్ నివసిస్తున్న అపార్ట్మెంట్లో పనికోసం చేరి, అతనికి దగ్గరైన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యవతి(40) అనే మహిళ
తనకు ముందే పెళ్లయిన విషయాన్ని దాచి, పెంటేష్‌ను వివాహం చేసుకున్న సత్యవతి
కొద్దిరోజులకు అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి(38) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, మధుసూదన్ ఇల్లు ఖాళీ చేయించిన పెంటేష్
దీంతో పెంటేష్‌ను హతమార్చాలని నిర్ణయించుకుని, గత ఏడాది నవంబర్ 19వ తేదీన పెంటేష్‌కు నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టి, స్పృహ కోల్పోయాక మధుసూదన్ రెడ్డితో కలిసి మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసిన సత్యవతి
అనంతరం కారులో మృతదేహాన్ని మహారాష్ట్రలోని తుల్జాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసిన నిందితులు
మృతదేహం పాక్షికంగా కాలడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు
హైదరాబాద్ తిరిగి వచ్చి తన భర్త కనిపించడంలేదని సత్యవతి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు
పెంటేష్ చివరిసారిగా బేగంపేట ప్రాంతంలో ఫోన్ మాట్లాడినట్టు పోలీసుల గుర్తింపు
ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా పోలీసులకు చిక్కని పెంటేష్ ఆచూకీ
సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన పెంటేష్ బంధువులు
దీంతో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, తామే హత్య చేసినట్టు అంగీకరించిన నిందితులు