Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 11:33 am Editor : Admin

10న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి   జూలై 8

జులై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి

కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థలు మూసివేసి విద్యార్థుల ఐక్యతను చాటుదాం

టి. నితీష్ ధర్మతేజ, ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం సమితి నాయకుడు టి. నితీష్ ధర్మతేజ తీవ్రంగా విమర్శించారు.

విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకపోవడం, విద్యార్థులపై ఫీజుల భారం పెంచడం, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వంటి ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు.

ప్రజాస్వామ్య, లౌకిక, శాస్త్రీయ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి.

అన్ని విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి.

ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి.

విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను ఉపసంహరించుకోవాలి.

చివరగా జులై 10న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేసి విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టి. నితీష్ ధర్మతేజ పిలుపునిచ్చారు.