(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ జూలై 8
విద్యార్థులకు రేవంత్ ” అరాచక ” హస్తం
కాలేజీలకు రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ పెట్టిన రేవంత్ సర్కారు
అటు ప్రభుత్వం.. ఇటు కాలేజీ యాజమాన్యాల మధ్యలో నలిగిపోతున్న పేద విద్యార్థులు
విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు మరిచి విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం
బకాయిలు అడిగిన ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ దాడుల పేరుతో రేవంత్ బెదిరింపులు
వన్ టైం సెటిల్‌మెంట్ చేసుకోవాలని కాలేజీలపై ఒత్తిడి తీసుకొచ్చిన ప్రభుత్వ పెద్దలు
విజిలెన్స్ దాడుల పేరిట బెదిరించినా వెనక్కి తగ్గని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు
బకాయిలు, ప్రభుత్వ కొత్త జీవోలపై కోర్టుకు వెళ్లిన కాలేజీలు.. అయినా ఫలితం శూన్యం
విద్యార్థుల ఖాతాలలో నేరుగా డబ్బులు వేస్తామని కొత్తగా జీవో9 తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి
మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు లేక ఆర్ధికంగా దెబ్బతిన్న ప్రైవేట్ కాలేజీలు
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు అడిగితే..ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి
అప్పు చేసి, ఆస్తులమ్మి ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో విద్యార్థులు