(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాజస్థాన్ లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
జిల్లా కేంద్రంలో ఐద్వా మహిళ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన
నేటి సత్యం జూలై 9 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య
మానుకోట:రాజస్థాన్ లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చింత మౌనిక,జిల్లా నాయకురాలు అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.రాజస్థాన్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన 32 మంది నిందితులను ఫాస్ట్ ట్రాక్ కొర్టు ఏర్పాటు చేసికఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా మైనర్ బాలికపై 32 మంది దుర్మార్గులు మానవ మృగాలు లాగా వ్యవహరించి ఐదు రోజులపాటు హత్యాచారం జరిపి చంపడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.హత్యాచారానికి గురైన బాధితురాలు కుటుంబానికి ఆయా ప్రభుత్వాలు అన్ని రకాలుగా అండగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా,పట్టణ కమిటీ సభ్యులున్నారు