Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 11:04 am Editor : Admin

త్వరగా ఏనుమరేషన్ ఫారాలు అందించాలి..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేరిలింగంపల్లి జులై 10

ప్రతి అర్హత కలిగినఓటరుకు ఏనుమరేషన్ ఫారాలు వెంటనే అందించాలి టి. రామకృష్ణ

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి అర్హ ఓటరుకు ఏనుమరేషన్ ఫారాలను బీఎల్ఓలు త్వరితగతిన అందించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అత్యంత విలువైనదని, కేవలం నిర్లక్ష్యం వల్ల ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి మిస్ కాకూడదని ఆయన అన్నారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రతి కుటుంబాన్ని స్వయంగా కలుసుకుని ఏనుమరేషన్ ఫారాలను అందించి, వాటి గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు.

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులు, విద్యార్థులు, అద్దె ఇళ్లలో నివసించే వారు, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత ఒక్కరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ప్రతి అర్హ ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే ప్రధాన బాధ్యత అని పేర్కొన్న టి. రామకృష్ణ, ఎన్నికల అధికారులు కూడా ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించి ఎలాంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.