(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 10
*బహుజన రాజ్యాధికారం సాధించడానికి అన్ని బీసీ కులాలు ముందుకు రావాలి.. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పిలుపు*
*బీసీ ఐక్యవేదికకు మద్దతు తెలిపిన నాయి బ్రాహ్మణ సంఘం*
బహుజన రాజ్యాధికారం సాధించటానికి
బీసీ కులాల, బీసీ సంఘాల నాయకులను గత నెల నుండి కలిసి ఐక్యత పెంచేందుకు, బహుజనులకు రాజ్యాధికారం సాధనకై కృషి చేయాలనేదే బీసీ ఐక్యవేదిక ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నదని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పేర్కొన్నారు. బీసీ కులాలన్నిటికీ మరియు ముఖ్య నాయకులను బేరి రామచందర్ యాదవ్ కలిసి పోరాటాలను పిలుపునిస్తూ ముందుకు రావాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘాల నాయకులను కలిసే క్రమంలో శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మంగలి సాయిలు నాయి బ్రాహ్మణ కార్యవర్గ నాయకులను కలవడం జరిగింది. చర్చల సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం కార్యవర్గం మొత్తం బీసీ కులాల సంఘాలకు ఐక్య వేదికకు పూర్తి మద్దతు తెలిపడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల సంఘాల నాయకులతో కలిసి చర్చించడం జరుగుతుందని అన్ని కుల సంఘాల నాయకుల మద్దతుతో అధికారం సాధిస్తామని అన్నారు. ముదిరాజ్, యాదవ్, పద్మశాలి ,గౌడ్స్ మున్నూరు కాపు సంఘాలను కలవడం జరుగుతుందని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాలకు ఇప్పటికీ కూడా గుర్తింపు లేకుండా పోయిందనీ, రోడ్లపైనే ఉండటానికి ఇల్లు లేక జీవనాధారం లేక బ్రతుకు ఈడుస్తున్నారని అని పేర్కొన్నారు. కనీసం కులంపేరు కూడా చెప్పుకోలేని స్థితిలో కొన్ని కులాలు బాధపడుతున్నాయని అన్నారు. మరి రాష్ట్రంలో కులాల దామాషా పద్ధతిన ఎవరికి రావాల్సిన వాటా వారికి అందాలని అన్నారు. విద్యతో సహా వైద్యం, ఉద్యోగం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కావాలని బీసీలు మేమెంతో మాకంత విద్యా ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగాలలో సమాన హక్కులు కల్పనపై అందరూ కలిసి పోరాటం చేద్దాం అన్నారు. ఈ పోరాటంలో అన్ని కుల సంఘాలు అందరు నాయకులు బీసీ కులాల ఐక్యవేదికకు పూర్తి మద్దతు తెలిపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తో పాటు సాయన్న ముదిరాజ్, ఆర్గనైజర్ సెక్రెటరీ హరికృష్ణ చారి, యువజన సంఘం అధ్యక్షులు కుమార్ యాదవ్, సాయి కురుమ, రాజు గౌడ్, పద్మశాలి అశోక్, కిరణ్ ముదిరాజ్, రజక సంఘం మల్లేష్, పెద్దలు యువత అందరికి రాజ్యాధికారం కోసం చర్చించారు. అన్ని కుల సంఘాల నాయకులు బేరి రామచందర్ యాదవ్ ఫోన్ నెంబర్ సంప్రదించవలసిన 89 78 99 98 96, సాయన్న ముదిరాజ్ 9951881755