(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం జూలై 11
నేను బతికే ఉన్నాను..నా భూమి నాకు ఇవ్వండి..!
బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమి కాజేసిన అక్రమార్కులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడె గ్రామంలో ఐదెకరాల అసైన్డ్ భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సత్యం అనే వ్యక్తి
నలుగురు కూతుర్లు వివాహం చేసుకుని వెళ్లిపోగా, బతుకు దెరువు కోసం వేరే ప్రాంతంలో నివసిస్తున్న కొడుకు
సత్యం ఒంటరిగా ఉంటున్నాడని గమనించి తన ఐదెకరాల అసైన్డ్ భూమిపై కన్నేసిన నామా సత్యనారాయణ అనే వ్యక్తి
జీపీవో అనంతలక్ష్మి సహాయంతో సత్యం 2018లోనే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, సత్యనారాయణ భార్య పుష్పవతి బాధితుడికి ఏకైక కూతురని మరో కుటుంబ సర్టిఫికెట్ సృష్టించిన నిందితుడు
ఈ రెండు నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా సత్యం పేరు మీద ఉన్న భూమిని సత్యనారాయణ భార్య పుష్పవతి పేరిట వారసత్వ బదిలీ చేసిన తహసీల్దార్
అయితే తన సంతకాన్ని, ఆర్ఐ వీరస్వామి సంతకాన్ని ఫోర్జరీ చేసి, జీపీవో నకిలీ కుటుంబ పత్రాన్ని సృష్టించిందని, దాని ఆధారంగా పొరపాటున భూబదిలీ చేశానని తెలిపిన తహసీల్దార్ రాంనరేష్
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన జీపీవో అనంతలక్ష్మిపై చర్యలు తీసుకుంటామని తెలిపిన ఉన్నతాధికారులు