Neti Satyam
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 9:09 am Editor : Admin

ఉద్యమకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శంషాబాద్ జూలై 13

మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డు, గుర్తింపు కార్డులు ఇవ్వాలి

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మంచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతిపత్రం

శంషాబాద్, జూలై 13: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మంచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం శంషాబాద్ ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మలిదశ ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం గుర్తించి, అర్హులైన ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డు, ఉద్యమకారుల గుర్తింపు కార్డు మంజూరు చేయాలని కోరారు. ఉద్యమకారులకు గతంలో ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంఆర్ఓ, ఈ అంశాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిన్నగండు రాజేందర్, సాలివేంద్రి వెంకట్ రెడ్డి, మంచర్ల మోహన్ రావు, పనిగంటి ఆనంద్, మంచర్ల హరికృష్ణ, గూడెపు అశోక్, కొనమొల్ల శ్రీనివాస్, జగయ్య, ఆర్.ఎస్. రమేష్, ఆర్.కె. రమేష్, జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.