(adsbygoogle = window.adsbygoogle || []).push({});
షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం
షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో నిందితుడిగా పోలీసులు పేర్కొన్న రాజ్‌కుమార్ మృతదేహం సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో లభ్యమైంది.స్థానికులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే డయల్–100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, రాజ్‌కుమార్ తన మేనమామ గ్రామమైన పెంజర్లకు వెళ్లినట్లు తెలిసింది. మృతదేహం పక్కనే విషం (పాయిజన్) బాటిల్ లభ్యమైనట్లు సమాచారం. దీంతో అతడు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.రాజ్‌కుమార్ మృతికి గల ఖచ్చితమైన కారణాలను పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు.షాబాద్ ఆరు హత్యల కేసు దర్యాప్తులో ఈ పరిణామం కీలకంగా మారింది.