Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 2:19 pm Editor : Admin

అక్రమంగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శంషాబాద్ జులై 16

నిబంధనలకు విరుద్ధంగా

 బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి ప్రభుత్వానికి గండి కొడుతున్న వ్యాపారులు

సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి

శంషాబాద్ పట్టణ శివారులోని సాయి బాలాజీ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తు అపార్ట్మెంట్ కట్టి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను సిపిఐ మండల కార్యదర్శి నర్రాగిరి డిమాండ్ చేశారు.

పట్టణం నడిబొడ్డున శివారులలో ఇంతటి దుర్మార్గమైన వ్యాపారం జరుగుతుంటే జిహెచ్ఎంసి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు

అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నర్రాగిరి అధికారులకు తెలిపారు