(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం తెలకపల్లి జూలై 16
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తి జైలు శిక్ష. ముగ్గురికి జరిమానా .
తెలకపల్లి ఎస్సై ఎం రమేష్.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయగా వారిలో ఒక వ్యక్తికి మూడు రోజులు జల శిక్ష మరో ముగ్గురికి జరిమానా విధించడం జరిగిందని తెలకపల్లి ఎస్సై ఎం రమేష్ తెలిపారు. గురువారం మార్నింగ్ కోర్టు జడ్జి రామ్ గోపాల్ దగ్గర హాజరపరచగా లింగాల మండల కేంద్రంలో చెందిన మూడవ నాగరాజు కు రూపాయలు 2100 .తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన అతినారపుకిరణ్ కుమార్ కు. రూ.5000 లింగాల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన తిప్ప వెంకటయ్యకు ₹2,000 జరిమానా విధించడం జరిగింది. వారితోపాటు తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన వడ్డేమాన్ శ్రీనుకు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామ్ గోపాల్ తీర్పు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. మద్యం తాగి వాహనం నడప రాదని నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని .వాహనానికి సంబంధించిన పత్రాలు. టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని . రాంగ్ రూట్లో వెళ్లరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనాన్ని అతివేగంగా నడపరాదని ఎస్ ఐ సూచించారు.