Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 2:53 pm Editor : Admin

రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామిక చర్య..!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 21

రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామిక చర్య

*నీట్ వ్యవహారంపై పార్లమెంట్‌లో తక్షణమే చర్చ జరపాలి – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి*

*టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*

ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే అప్రజాస్వామిక చర్య అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసిన నీట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రశ్నించే వారిపై నిర్బంధ చర్యలకు దిగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.

నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమైన లోపాలు, అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా పార్లమెంట్‌ను స్తంభింపజేయడం, ప్రతిపక్షాలపై నిర్బంధ చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రశ్నించే స్వరాలను అణచివేయడం ద్వారా వాస్తవాలను దాచిపెట్టలేరని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతీకార రాజకీయాలను విరమించి, పార్లమెంట్‌లో నీట్ అంశంపై పూర్తి స్థాయి చర్చ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేశ విద్యార్థులకు న్యాయం చేయాలని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.