(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శంషాబాద్ జూలై 22
ఎలాంటి అనుమతులు లేకుండా మసీదును నిర్మించడం తగదని ప్రకాష్ నగర్ కాలనీవాసులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి ఫిర్యాదు
శంషాబాద్ పట్టణం లోని ప్రకాష్ నగర్ కాలనీ వడ్డెర కాలానికి మధ్యలో మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా మసీదును నిర్మించడం తగదని ఈరోజు జిల్లా కలెక్టర్. నారాయణరెడ్డి కి ఆ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు
ఈ సందర్భంగా కాలనీ వాసులు నర్ర పాండు రామారావు నర్రగిరి మరి కొంతమంది మాట్లాడుతూ ప్రకాష్ నగర్ కాలనీలో ఎక్కువ మంది హిందువులు నివాసం ఉంటున్నారు అలాంటి కాలనీ దగ్గరలో మసీదును నిర్మించడం వల్ల రెండు మతాల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నందువల్ల తక్షణమే మసీదు నిర్మాణాన్ని ఆపేయాలని వారు అధికారులను డిమాండ్ చేశారు
ఇప్పటికే అనేక సందర్భాలలో ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి కలిసి సమస్యను వివరించినట్టు నర్రగిరి తదితరులు తెలిపారు