Neti Satyam
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 12:10 pm Editor : Admin

రాష్ట్రంలో జీవో నెంబర్ 6 ను అమలు రద్దు చేయండి.. జైపాల్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూలై 22

రాష్ట్రంలో జీవో నెంబర్ 6 ను  రద్దు చేయాలి

తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కే ఏసురత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ని సచివాలయంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకట్ స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రితో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుదల కోసం మాట్లాడి వివరిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకపోతానని చెప్పడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 6 ని ప్రకటించడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు ఈ యొక్క జీవో అమలు చేస్తే అన్యాయం జరుగుతుంది. కార్మిక శాఖ మంత్రి కి వివరించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఇప్పటికే ఇస్తున్నట్టు వంటి వేతనాల కంటే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తక్కువగా ఉన్నాయని వివరించడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరుగ లేదని వివరించడం జరిగింది. కార్మిక శాఖ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు సచివాలయంలో లా సెక్రటరీ పాపిరెడ్డి గారికి యూనియన్ నాయకులకు ప్రభుత్వంతో చర్చలకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.