Neti Satyam
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 3:22 pm Editor : Admin

డంపింగ్ యార్డ్ ను శాశ్వతంగా ఎత్తివేయాలి. సిపిఐ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం జవహర్ నగర్ జులై 22

డంపింగ్ యార్డును శాశ్వతంగ ఎత్తివేయాలి / సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు….

— పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన నేతలు.

–జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్.

ప్రజల ఆరోగ్య భద్రతాను, జీవన మనుగడను ద్రుష్టిలో పెట్టుకొని, జవహర్ నగర్ డంపింగ్ పరిసర ప్రాంతాల ప్రజల సంపూర్ణ విముక్తికై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా రాంకీ చెత్తడంపింగ్ యార్డును శాశ్వతంగా తోలగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. 2026, బుదవారం రోజు, హైదరాబాద్, సోమాజిగూడలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఏ సమాజంలోనైన ఆ సమాజం అభివృద్ధి చెందాలంటే? పర్యావరణ పరిరక్షణ అవసరం అని అన్నారు. మంచిగాలి, నీరు, నేలను గత 25 సంవత్సరాలుగా కలుషితం చేసిన డంపింగ్ యార్డు తొలగింపు పట్ల శాస్త్రవేత్తల సూచనలను, ఉద్యమ రాశుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, జవహర్ నగర్ ప్రాంతం నుండి శాస్త్రయ పద్దతిలో తోలగించాలని కోరారు. ప్రజల ఆందోళనలు, భయాలు తొలగించాల్సిన భాద్యత పాలకులపై ఉంటుందని గుర్తుచేశారు. తొలగింపులో ఏమాత్రం నిర్లక్ష్యం, మొండి వైఖరి అనుసరించిన భాదిత ప్రాంత ప్రజలు జరిపే పోరిటాలకు నైతిక భాద్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. కమిటీ గౌరవ సలహాదారులు, మాజీ ఉప సర్పంచ్ రావల్ కోల్ నర్సింహ్మ గౌడ్, సిపిఎం శ్రీనివాస్, శివన్నారాయణ, సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ అనురాధ, సిపిఐ(ఎం.ఎల్)మొస్ లైన్ గడ్డం సదానందం, ఆమ్ అద్మీ పార్టీ బుర్ర రాముగౌడ్, మోఇన్, బహుజన సత్త బండకింది సింగరయ్య గౌడ్, బహుజన రక్షణ సమితి ఏ.సతీష్, మహ్మద్ జావేద్, టియుజేఏసి కల్లెపు ప్రసాద్, సుజి, పిడిఎం రాజు, చంద్రమౌళి, పిఓడబ్ల్యూ(విముక్తి) పెర్క సునీత, ప్రజా నాట్య మండలి వెంకటారి, పికెఎం రాజానర్సింహ్మ, యాప్రాల్ కాంగ్రెస్ సాయికుమార్, టియుసిఐ వి.ప్రవీణ్, ఐ.ఎఫ్.టి.యు. పి.శివబాబు, పిఓడబ్ల్యూ డి.స్వరూప తదితరులు పై మీడియా సమావేశంలో పాల్గొన్నవారిలో ఉన్నారు. చివరలో కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో కీసర సర్కీల్, జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిలో గల స్వర్ణాంద్రా, డి.ఎన్.ఆర్.ఫంక్షన్ హాలులో 2026, జూలై-26, ఆదివారం రోజు పర్యావరణం, ఆరోగ్య భద్రీ, జీవించే హక్కు పై జరిగే మేదావుల, విద్యావేత్తల సదస్సును జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.