Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 10:36 am Editor : Admin

ఫిట్నెస్ లేని బస్సులు పిల్లల ప్రాణాలతో చెలగాటం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం జిల్లేడు చౌదరిగుడా జులై 25

ఫిట్నెస్ లేని బస్సులు నడిపి విద్యార్థుల చావుకు కారణమైతున్న అభ్యాస్ విద్యాపీఠం ప్రైవేటు స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి బుద్ధుల జంగయ్య

జిల్లేడు చౌదరిగుడా మండల కేంద్రంలో అభ్యాస్ విద్యాపీఠం ప్రైవేటు స్కూల్ యజమాన్య నిర్లక్ష్యం వల్ల ఎల్కేజీ విద్యార్థి దుర్మరణం పాలయిందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జిల్లేడు చౌదరిగుడా మండల ఇన్చార్జి బుద్ధుల జంగయ్య సిపిఐ మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ మండల సహాయ కార్యదర్శి బాలరాజ్ యాదవ్ తో కలిసి ఆయన ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ముబడిగా ప్రైవేటు స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వడం ఆర్టీవో అధికారులు ఫిట్నెస్ లేని బస్సులకు పర్మిషన్ ఇవ్వడం మూలంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు ప్రభుత్వ స్కూల్లో కనీస వస్తువులు లేవు కొన్ని స్కూల్స్ శీతీల అవస్థకు చేరిన పట్టించుకునే నాధుడు లేడు ఆ మూలంగానే పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారని

ఆ కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలియజేశారు ప్రభుత్వ స్కూల్లలో కనీస వసతులుండి సరిపడా టీచర్స్ ఉండి ఉంటే ఆ ప్రభుత్వ బడిలోనే పిల్లలు చదువుకునేవారని అలాంటి వసతులు లేకనే సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రైవేటు పాఠశాలలకు వేలాది రూపాయల భారాన్ని మోస్తూ పంపించడం జరుగుతుంది చదివించడం జరుగుతుందని దీనికి కారణం పాలక ప్రభుత్వాలు కాదా అని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల వల్లనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వెంటనే అభ్యాస్ ప్రైవేటు స్కూల్ యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నందుకు ఆ బస్సులన్నిటిని కూడా ఆర్టీవో బ్రేక్ ఇన్స్పెక్టర్ చెకప్ చేసి వాటిని చీజ్ చేయాలని ఆయన అధికారులను కోరారు

నిర్లక్ష్యానికి ఒక పసి ప్రాణం బలి అయింది మరో పసి ప్రాణం బలి కాకముందే ప్రైవేటు స్కూల్ అన్నింటి పై ప్రభుత్వపరంగా ఎంక్వయిరీ చేసి పర్మిషన్ లేని స్కూల్స్ ను గుర్తింపు రద్దు చేయడంతో పాటు పీక్నెస్ లేని బస్సులను అన్నిటిని కూడా చీజ్ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు లేని ఎడల సిపిఐ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు