Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 12:44 pm Editor : Admin

విద్యార్థి యువజనుల పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి జులై 25

విద్యార్థి–యువజనుల పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా – ప్రజాస్వామ్యం గెలిచింది

– టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు సాగించిన నిరంతర పోరాటాల విజయమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పేర్కొన్నారు.

నీట్ వ్యవహారంలో జరిగిన అవకతవకలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న అక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు, యువజనులు దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయని ఆయన అన్నారు. ప్రజల ఐక్య పోరాటం ముందు అధికార అహంకారం నిలవదని ఈ పరిణామం మరోసారి నిరూపించిందన్నారు.

విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విరమించుకోవాలని, పారదర్శకమైన, సమాన అవకాశాలు కల్పించే విద్యా విధానాన్ని అమలు చేయాలని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు. నీట్ వంటి పరీక్షల పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను పునఃసమీక్షించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రజల చైతన్యపూర్వక పోరాటాలేనని, విద్యార్థులు, యువజనులు ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలపై మరింత ఐక్యంగా ఉద్యమించాలని టి. రామకృష్ణ పిలుపునిచ్చారు.