(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం జులై 26
యాదవ సోదరులకు అడిగిన వెంటనే 70 టీ-షర్ట్స్ అందించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్
బీరప్ప కురుమ యువజన సంఘము యువకులకు సమ్మి గౌడ్ ఫౌండేషన్ చేయూత
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉప్పరపల్లి గ్రామంలోని శ్రీ బీరప్ప స్వామి దేవస్థానంలో బీరప్ప కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి.
ఈ సందర్భంగా ఉప్పరపల్లి బీరప్ప కురుమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ కలిసి సంఘ సభ్యులకు 70 టీ-షర్ట్స్ అందించాలని కోరగా, వెంటనే సానుకూలంగా స్పందించి 70 టీ-షర్ట్స్ అందజేశారు.
ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక, సాంప్రదాయ కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, సమాజ సేవే తన లక్ష్యమని అన్నారు.
బీరప్ప కురుమ సంఘం అధ్యక్షులు, సభ్యులు మాట్లాడుతూ తమ విజ్ఞప్తిని ఆలకించి టీ-షర్ట్స్ అందించిన సమ్మయ్య గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. *గ్రామాభివృద్ధి, ప్రజా సేవ, సామాజిక కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సహకారం ఆదర్శనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సమ్మి గౌడ్ ఫౌండేషన్ టీం సభ్యులు మరియు గ్రామ పలుస పద్మ వెంకన్న (8వ వార్డు), తండా సంపత్ (9వ వార్డు), పలుస రాకేష్, ఎసల్ల సత్యనారాయణ, కొమ్మనబోయిన రంజిత్, సీలోజు విజేందర్ అలాగే బీరప్ప కురుమ సంఘం సభ్యులు యారా ముత్తయ్య, కంచ కట్టయ్య, కంకల శ్రీనివాస్, కంకల బీరయ్య, కంకల సుమన్, కంచ కుమారస్వామి, కంకల ఐలయ్య, కుండే రతన్, కుండే మహేందర్, అల్లి అశోక్, కంచ ఐలయ్య, కంకల కుమారస్వామి, కంకల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు