Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 6:34 am Editor : Admin

నడి రోడ్డు పై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓ ఎమ్ ఆర్ షీట్లు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూలై 27

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

బయటపడిన టీజీపీఎస్సీ పరిపాలన వైఫల్యం

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై శివరాంపల్లి నుంచి అరంఘర్ అండర్‌పాస్ వరకు కుప్పలుగా పడ్డ ఓఎంఆర్ షీట్లు

2018లో వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లుగా గుర్తింపు

అభ్యర్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్లు, పేపర్ కోడ్, ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండడంతో వాటిని సేకరిస్తూ ఫొటోలు తీసిన వాహనదారులు

విషయం తెలుసుకొని అక్కడికి చేరుకుని వాటిని సీజ్ చేసిన పోలీసులు

పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ పేపర్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి స్క్రాప్‌కు పంపి, రీసైక్లింగ్ చేయడం పద్ధతి

కానీ నిబంధనలు పాటించకుండా చిన్న చిన్న ముక్కలు చేయకుండా నేరుగా రీసైక్లింగ్ కోసం విజయవాడకు తీసుకెళ్తుండగా నడిరోడ్డుపై పడిపోయిన ఓఎంఆర్ షీట్లు

గోప్యంగా ఉండాల్సిన పేపర్లను ఇలా నడిరోడ్డుపై దొరికేలా చేశారని టీజీపీఎస్సీపై అభ్యర్థుల ఆగ్రహం

ఈ ఘటనపై 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని తమ పరిధిలోని ఎస్పీని ఆదేశించిన టీజీపీఎస్సీ

నివేదిక ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన టీజీపీఎస్సీ