Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 2:55 pm Editor : Admin

శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి ఆగస్టు 3

ఇతర పార్టీల పై వ్యతిరేకత.. బీఆర్ఎస్‌లోకి వలసలు

*రోజురోజుకూ పుంజుకుంటున్న గులాబీ పార్టీ బలం*

*కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మాదాపూర్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మదనాచారి*

*మాధవరం కృష్ణారావు గారి ప్రోద్బలంతో బొబ్బ నవత రెడ్డి సహకారం తో,శ్రీనివాస్ గౌడ్,రాయల కార్తిక్ సమక్షంలో మాదాపూర్ డివిజన్ లో చేరికలు*

నియోజకవర్గంలో ఇతర పార్టీలు పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా బలం పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా గులాబీ గూటికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాదాపూర్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీ మదనాచారి సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

*కేటీఆర్ చేతుల మీదుగా..*

కూకట్‌పల్లి శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు అండదండలతో,బొబ్బ నవత రెడ్డి సహకారం తో,శ్రీనివాస్ గౌడ్ మరియు కార్తిక్ ఆధ్వర్యంలో మాదాపూర్ బీ. జే. పి మాజీ అధ్యక్షుడు మదనాచారి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) స్వయంగా ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కే. టీ. ఆర్ గారు సూసించారు.

ఈ చేరికల కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నాయకులు

లక్ష్మణ్, నరేందర్ రెడ్డి, అభినంద్,తదితరులు పాల్గొన్నారు.