(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పోగొట్టుకున్న రూ.4.50 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి బాధితురాలికి అప్పగించిన కాజీపేట పోలీసులు
నేటి సత్యం ఆగస్టు 3 ప్రతినిధి కొమిరే యాకయ్య
కాజీపేట వరంగల్
హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసన్ కృష్ణస్వామి కుమార్తె శ్రీమతి మృదుల శ్రీనివాసన్, ఎన్‌ఐటీ వరంగల్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఐదో సంవత్సరం చదువుతున్నారు. ఆమెకు చెందిన సుమారు మూడు తులాల బంగారు గొలుసు ఆర్‌ఈసీ ప్రాంగణంలో పోయినట్లు కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే సీఐ/ఎస్‌హెచ్‌వో శ్రీ శ్యాంసుందర్ గారు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
ఆయన ఆదేశాల మేరకు, ఎస్సై శివ గారి పర్యవేక్షణలో క్రైమ్ టీమ్ సభ్యులు వి. క్రాంతి కుమార్, జి. కుమారస్వామి సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, సుమారు రూ.4.50 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు.
ఈ సందర్భంగా శ్రీమతి మృదుల శ్రీనివాసన్ కాజీపేట పోలీసుల వేగవంతమైన స్పందన, అంకితభావం, సమర్థవంతమైన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.
కాజీపేట పోలీసులు – ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుంటారు.