రక్తం రంగు ఒకటే.. హృదయాల మధ్యలో గొడవలు ఎందుకు..
నేటి సత్యం ఆగస్టు 4 రక్తం రంగు ఒక్కటే.. *మరి హృదయాల మధ్య ఈ గోడలెందుకు?* ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి ఒకే తల్లి కడుపు నుండి వచ్చినట్టు కాదు కానీ మనమందరం ఒకే శ్వాసను పీల్చుకుంటున్నాం. ఒకే సూర్యుడి వెలుతురులో నడుస్తున్నాం. ఒకే ఆకాశం కింద నిద్రపోతున్నాం. అయినా *ఈ మనిషి మనిషిని ఎందుకు ద్వేషిస్తున్నాడు? మతానికి మతం కత్తులు నూరుతున్నది. కులానికి కులం నెత్తురు చిందిస్తున్నది. దేశానికి దేశం అణుబాంబు చేతిలో పట్టుకుని...